సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రేడ్ 1 కాంట్రాక్టర్ కీశే శ్రీ నాచు సత్యనారాయణ (సత్యం) పెదకార్యానికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఈరోజు ఆదివారం మధ్యాహ్నం హాజరు అయ్యారు. నాచు సత్యం, చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు. కాంగ్రెస్ పార్టీలో నిబద్దత తో పనిచేసిన నేత నాచు సత్యంతో తన అనుభూతులను ఆయనను ఆదర్శ్యంగా తన రాజకీయ పయనం సాగిందని, మంచి వ్యక్తిత్వంతో ఆయన భీమవరం పట్టణానికి చేసిన సేవలును ఈ సందర్భముగా కొయ్య మోషను రాజు ప్రస్తుతించారు.ఆయనతో పాటు నాచు శేషగిరి రావు, టీడీపీ నేత మెంటే పార్ధసారధి తదితరులు నాచు సత్యం కు నివాళ్లు అర్పించారు.
