సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని లోని స్థానిక వైసిపి పార్టీ కార్యాలయం ఆవరణలో స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసిపి నేతలు పుష్ప మాలలు వేసి, ఆయన రాష్ట్రానికి చేసిన సేవలుకు ఘన నివాళ్లు అర్పించి , కేక్ కట్ చేసి , మిఠాయి పంపిణి చేసుకొన్నారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వర్గీయ వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణించి దశాబ్దం దాటుతున్న ఆయన చేసిన ప్రజా సంక్షేమ పధకాలు ,రాష్ట్ర అభివృద్ధికి పనులు వల్లే ప్రజల గుండెలలో ఇప్పటికి చిరస్థాయి గా జీవించి ఉన్నారని, మనిషి బ్రతికుండగా చేసిన మంచి ఎప్పడు సజీవంగా ఉంటుందని ..ఆయనతో కల్సి ఎమ్మెల్యే గా తాను పనిచెయ్యడం తన అదృష్టం అని తండ్రికి తగ్గ తనయుడిగా వై ఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన చేస్తున్నారని, అభివర్ణించారు. మేడిది జాన్సన్, వేండ్ర వెంకట స్వామి, గూడూరి ఉమాబాల, తోట బోగయ్య , కామన నాగేశ్వర రావు తదితర నేతలు,ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. తదుపరి ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ పట్టణంలోని డ్వాక్రా , ఇతర మహిళా సంఘలచే తయారు చేయబడిన హ్యాండీ క్రాఫ్ట్ ఉత్పత్తులచే ఏర్పాటుచేసిన “జగనన్న మార్ట్” ను సందర్శించి ఆ మహిళలను అభినందించారు.
