సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నా నేల .. వచ్చే ఎన్నికలలో నా పోరాటం ఇక్కడి నుండే అని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించి, ఉభయ గోదావరి జిల్లాలలో 34 స్థానాలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జనసేన నేతలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో .. మరల 2వ విడుత వారాహి యాత్ర జనసేన ప్రకంపనలు తో..తెలుగు దేశం పార్టీ నేతలలో ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. ఇక జనసేన తో పొత్తు మాట దేవుడు ఎరుగు ? ముందు పార్టీకి ఉన్న బలమైన క్యాడర్ ను కాపాడుకొనే పనిలో పార్టీ పెద్దలు సమాయత్తమౌతున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ బస్సుయాత్ర త్వరలో భీమవరంలో జరగనుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ప్రకటించారు. తాజగా. పార్టీ సీనియర్ నేతలతో తాజా పరిణామాలఫై చర్చించారు. భీమవరంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఎంతో అభివృద్ధి చేశామని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని.. ఎవరి ప్రభావానికి లోను కావద్దని ఇక్కడ టీడీపీ క్యాడర్ ను మరింత బలోపేతం చెయ్యాలని .. దీనిలో భాగంగా అధినేత చంద్రబాబు మరి కొద్దీ రోజులలో భీమవరం వస్తున్నారని .. ఆయన బస్సు యాత్రను విజయవంతం చేసేలా నాయకులు, శ్రేణులు సమన్వయంతో కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
