సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి కి సంబంధించి నాబార్డ్ నుండి మరో రూ 28 కోట్ల నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ఈ ఆస్పత్రి నిర్మాణానికి రూ 10 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, రెండో విడతగా నాబార్డు నిధులు నుండి 28 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి భీమవరం నగర బాట పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో 100 పడకల ఆసుపత్రి ఆవశ్యకత కోసం ఆయనకు వివరించడం జరిగిందని అన్నారు. ఆనాడు ఆయన తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు ఈ ఆస్పత్రి కోసం కృషి చేయలేదని అన్నారు. తాను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ముందుగా సీఎం జగన్ తో మాట్లాడి ఈ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించడం జరిగిందన్నారు.అతి త్వరలో ఆసుపత్రీ నిర్మాణం పూర్తీ అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *