సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అతి పురాతన మంత్రాలలో గాయత్రి మంత్రం అపూర్వమైనది. వ్యక్తిని శక్తివంతం చేస్తుందని, గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం ఎంతో మంచిది. భీమవరంలో గాయత్రీ మహా యజ్ఞాన్ని 5 రోజులపాటు నిర్వహించడం దైవ సంకల్పమేనని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. పెద అమిరంలో జరుగుతున్న 108 కుండముల గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నేడు, శనివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. యజ్ఞ కన్వీనర్ వేగేశ్న రమేష్ వర్మ, సభ్యులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేశంలో 16 కోట్లమంది గాయత్రీ భక్తులున్నారని, రోజు 24 లక్షల గాయత్రీ జపం జపించబడుతుందన్నారు. 5వ రోజు ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమంతో 108 కుండముల జ్ఞాన గాయత్రీ మహాయజ్ఞం కార్యక్రమం సాగింది. హరిద్వార్, అవతారం రాజు, వేగేశ్న రంగరాజు, నడింపల్లి బంగార్రాజు, కొత్తపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *