సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్,పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి, నియోజకవర్గంలోని 13 కుటుంబాల వారికి 10 లక్షల 83 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం మొత్తం కలత చెంది ఆందోళనతో ఉంటారని అటువంటి వారికి భరోసాగా ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు అండగా అనారోగ్యంతో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తున్నారని తెలిపారు.టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానటువంటి చికిత్స చేయించుకున్న బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కోట్లాది రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో భీమవరం పట్టణ మరియు వీరవాసరం,భీమవరం మండలాల అధ్యక్ష కార్యదర్శులు తదితర నేతలు పాల్గొన్నారు.
