సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారులోని పంక్షన్ హాలులో పవన్ కళ్యాణ్ అడ్జక్షతన నేటి సాయంత్రం నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో సమావేశాలు జరుగుతున్నాయి.తూర్పు కాపు కులానికి చెందిన పలువురు నేతలు పవన్ సమక్షంలో జనసేన లో చేరినట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా సమస్యలు , పార్టీ బలాబలాలు వంటి పలు విషయాలు ఫై సమావేశం లో పవన్ నేతలతో, క్యాడర్ తో చర్చిస్తున్నారు. ( ఫై ఫొటోలో చూడవచ్చు) నిన్న సోమవారం రాత్రి భీమవరం చేరుకొన్న పవన్ కళ్యాణ్ నేడు,మంగళవారం ఉదయం స్వల్ప అస్వస్థత కు లోనయిన నేపథ్యంలో కొంత విశ్రాంతి తీసుకోని, మధ్యాహ్నం నుండి పార్టీ సభ్యులతో కార్యాచరణ ప్రారంభించారు. కొద్దీ రోజులు ముందు సిగ్మా న్యూస్ లో పవన్ 4 రోజులు భీమవరంలో ఉండే అవకాశం ఉందని తెలిపినట్లు నేటి నుండి వరుసగా 4 రోజుల పాటు భీమవరంలోనే ఉండి ఉమ్మడి జిల్లా లో జనసేన బలోపేతం చెయ్యడానికి కీలక నేతలందరితో చర్చలలో పాల్గొంటారు. ఇక ఇప్పటి వరకు సస్పెన్సు కొనసాగుతున్న.. వారాహి విజయయాత్ర లో భాగంగా ఈనెల 30 వ తారీఖున సా 04:00 గ.లకు భీమవరం పట్టణంలోని ప్రధాన సెంటర్ యన్మదురు ప్రధాన వంతెన వద్ద అంబేడ్కర్ సెంటర్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు అధికారికంగా తెలిపాయి.
