సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో నేడు, మంగళవారం ప్రచండ భానుడి ప్రతాపం మాములుగా లేదు. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతో వడగాల్పుల ప్రభావం తీవ్రమవుతోంది. దీంతో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీని ప్రభావం గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాలపై వాతావరణ శాఖ ముందుగానే ఊహించినట్లు ప్రభావం కనిపించింది. వడ దెబ్బకు పలు ప్రాంతాలలో మరణాలు,అగ్ని ప్రమాదాలు సంభవించాయి. నేడు,మంగళవారం భీమవరం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఏలూరు, విజయవాడ ల లో ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాజమండ్రిలో 46 డిగ్రీలు నమోదు అయ్యింది. కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవిలో విజయవాడలో ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతుంటాయి. విజయవాడ నగరంలోని గీతా నగర్ ఐడీఎఫ్ సీ బ్యాంకు భవనంపై ఉన్న సెల్ ఫోన్ టవర్ ఇవాళ ఉన్నట్లుండి కాలిపోయింది. దీంతో స్దానికంగా ఉన్న బ్యాంకు సిబ్బందితో పాటు స్ధానికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ స్టేషన్ కు కాల్ చేయడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిస్ధితి అదుపులోకి తెచ్చారు. రాత్రిళ్ళు కూడా ప్రజలకు తీవ్ర ఉక్కపోత , వడగాల్పుల తీవ్రత తప్పడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పులు గమనించి ప్రజలు వేసవి చిట్కాలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండి చాలా అవసరం అయితేనే బయటకు రావడం మంచిది.
