సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించబోయే ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగం కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగం కోసం ఈ క్రింది వివరాలు తెలియజేయబడుతున్నాయి.స్థానిక భీమవరం పురపాలక సంఘం కార్యాలయం లో ఈనెల 23వ తేదీ సోమవారం ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు వారు అభ్యర్థులకు వేసిన ఓట్లకు సంబందించిన కవర్లు ను మూసివేసి అందజేయాలి.. దీనికి సమర్పించవలసిన పత్రాలు1. ఆధార్ కార్డు (Aadhaar Card) లేదా ఫోటో గుర్తింపు కార్డు (Photo Identity Card).2. ఎన్నికల విధుల ఆదేశాలు (Election Duty Orders).వారికీ గోప్యమైన ఓటింగ్ వ్యవస్థ మరియు వారి పత్రాల ధృవీకరణ కోసం గెజిటెడ్ అధికారుల సహాయం అందజేస్తారు. దీనికి వీడియో నిఘా వ్యవస్థ కవర్ చేస్తుంది అని అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారి మరియు భీమవరం మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *