సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పుట్టినరోజు వేడుకలను భీమవరం అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ వేదికలో నేడు, శుక్రవారం నిర్వహించారు. జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, శుభాకాంక్షలు తెలిపారు. గజమాలతో సత్కరించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరరావు మాట్లాడుతూ ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, ప్రజలకోసం ఆలోచిస్తూ ప్రజలమెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. మీరు నాపై చూపించిన ఆదరణ అభిమానం ఎప్పటికి మరువలేనని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎన్ డీఏ కూటమి ప్రభుత్వం నియోజక వర్గానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. 25 మంది దివ్యాంగులకు నూతన వస్త్రాలు, దుప్పట్లను శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు అందించారు
