సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేటగిరీల్లో రెగ్యులర్ బేస్‌లో 242, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భర్తీకి రంగం సిద్ధం చేశారు.పోస్టుల పేర్లు, వివరాలు, అర్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ప్రారంభ, చివరి తేదీ, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను అధికారక నోటిఫికేషన్‌లో పొందుపరుస్తామన్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.కాగా ఇప్పటికే 1620 పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 2తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది.
