సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో నేడు, సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభ తరుణంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో దిగ్విజయంగా నిర్వహించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న అధికారులను సిబ్బందిని వారు అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షణకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్న జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజలు , రాష్ట్ర, దేశ ప్రగతికి ప్రజలందరం పునరంకితం కావాలని అన్నారు.
