సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఏర్పాటు చేసిన రచ్చ బండ.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయడం ప్రజలను మభ్యపెట్టడానికి అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. నిజానికి 13 కోట్ల రూపాయలతో ఆసుపత్రి, మూడు కోట్ల రూపాయలతో బస్టాండ్ తాత్కాలిక పునరుద్ధరణ పనులు మినహా మిగిలినదంతా మోసమేనని ఆరోపించారు. భీమవరం పక్కనే ఉన్న కోపల్లె వంతెన నిర్మాణానికి గతంలోనే తాను సుమారు 12 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాలేదని దీంతో ఈ వంతెన నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా డబ్బులు పోగేసుకుని నాలుగు కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ కు అడ్వాన్స్ చెల్లించారని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే 1200 కోట్ల రూపాయల అంచనాతో కూడిన వాటర్ స్కీం మంజూరు అయిందని ఆరోపించారు. పాలకొల్లులో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని దగ్గలూరు వద్ద 40 ఎకరాలలో భూసేకరణ చేసినప్పటికీ, ఇప్పటివరకు సగం మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *