సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాక్షిక చంద్రగ్రహణం నేపథ్యంలో గత శనివారం సాయంత్రం 6గంటల నుండి భీమవరం లో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం తో పాటు ( ఫై ఫోటో) అన్ని దేవాలయాలు మూసివేసివేసారు. నేటి ఆదివారం తెల్లవారు జాము 3గంటలతో గ్రహణం ముగియడంతో భీమవరంలో సాక్షత్తు చంద్ర ప్రతిష్టగా స్కంద పురాణంలో పేర్కొన్న శ్రీ సోమేశ్వర పంచారామము తో పాటు పాటు అన్ని దేవాలయలలో సంప్రోక్షణ , దేవాలయ శుద్ధి అంతరం నేటి ఉదయం 8గంటలకు దేవాలయాలు తెరిచారు, శ్రీ సోమేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రహణం తదుపరి అనుసరించవలసిన కర్మల కోసం గ్రహ శాంతుల కోసం దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులతో శ్రీ సోమేశ్వర దేవాలయం సందడిగా ఉంది.
