సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం రెస్ట్ హౌస్ లోని ఛాంబర్ అఫ్ కామర్స్ భవనంలో వచ్చే మార్చి 1వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ఆదాయపు పన్ను అధికారి ( టి డి ఎస్) ఏలూరువారు ,టి డి ఎస్ పై అవగాహన సదస్సు ను ఏర్పాటు చేసారని ఈ అవగాహన సదస్సుకు అసిస్టెంట్ కమీషనర్ గారు టీడీఎస్ రేంజ్ విశాఖపట్నం మరియు ఇన్ కంటాక్స్ అధికారి( టీడీఎస్ ) ఏలూరువారు వ్యాపారస్తుల సమస్యలను, అనుమానాలను నివృత్తి చేస్తారని, కావున చాంబర్ సభ్యులు , అనుబంధ సంఘాల సభ్యులు అందరూ ఈ టీడీఎస్ ఆహగాహన సదస్సుకు హాజరు కావలసినదిగా భీమవరం ఛాంబర్ అఫ్ కామర్స్ కార్యదర్శి, సంగడి వీర వెంకట శివ సత్యనారాయణ(బుజ్జి) ఒక ప్రకటనలో కోరారు.
