సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి పక్ష నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం లో నేడు, సోమవారం సీఎం జగన్ పర్యటించారు. అక్కడ హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదలచేసారు. కదలి వస్తున్నా కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేసారు సీఎం జగన్. కుప్పం , పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగు, సాగునీటి కష్టాలు ఇక ఉండబోవన్నారు. తదుపరి బహిరంగ సభలోసీఎం జగన్ ప్రజలు నుద్దేశించి మాట్లాడుతూ.. మీ కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చిం ది ఎవరంటే మీ జగన్.. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది, రెవెన్యూ డివిజన్ గా మార్చింది. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ అంటూ ప్రసంగం లో పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పం ప్రజలను 3 దశాబ్దాలుగా మోసం చేస్తున్నారని, ఇక్కడి పాడి రైతులకు ద్రోహం చేస్తూ చంద్రబాబు తన హెరిటేజ్ లాభాల కోసం మూసివేయిం చిన చిత్తూరు డెయిరీని తాను తెరిపించన్నారు. జిల్లాలో వెల్లూరు మెడికల్ కాలేజ్..ను చంద్రబాబు అడ్డుకొంటే.. దాన్ని పునః ప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్ అన్నారు. ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో రూ. 14 వందల కోట్లును అక్క చెల్లెమ్మల ఖాతాల్లోజమ చేశాం అన్నారు. సీఎం జగన్
