సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ప్రత్యేక ఉపకారాగారంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహనా సదస్సుకు భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సురేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయమూర్తి ముద్దాయిలతో నేరుగా మాట్లాడి వారి కేసు వివరాలను, పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ఆర్ధిక స్ధోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేకపోతే జైలు అధికారి ద్వారా మండల న్యాయ సేవా సంస్ధను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని, ముద్దాయిలు తమ కుటుంబ సభ్యులను ధృష్టిలో వుంచుకుని సత్ప్రవర్తన కలిగి నేరాల జోలికి వెళ్ళకుండా వుండాలని హితవు పలికారు. జైలు సూపరింటెండెంట్ D.వెంకటగిరి జైలు పరిసరాలను, మహిళా బ్యారక్ ను, వంటగది, స్టోర్ రూమ్ ను చూపించి జైలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. న్యాయమూర్తి మధ్యాహ్న భోజనాన్ని, బియ్యం, పప్పు దినుసుల నిల్వలను వాటి నాణ్యత ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలేటి యోహాను (న్యూటన్), ప్యానల్ న్యాయవాదులు అంబేద్కర్, సుధీర్, రవికిరణ్, మీడియేషన్ న్యాయవాది విజయలక్ష్మి, పారా లీగల్ వాలంటీర్లు సత్యనారాయణరాజు, చంద్రరావు, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *