సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం 19వ రోజు నేడు, ఆదివారం శ్రీ స్వామివారి ఆలయమునకు భక్త సందోహం పోట్టెత్తిపోయారు. సుమారుగా 15 వేల మంది పైగా భక్తులు విచ్చేయగా దర్శనముల టికెట్స్ ద్వారా రూ- 3,25,000/- వేల రూపాయలు లడ్డు ప్రసాదం విక్రయం వలన రూ-30,000/- రూపాయలు వెరసి రూ- 3,55,000/-వేల రూపాయలు ఆదాయం వచ్చినది . శ్రీ స్వామివారి నిత్యాన్నదానం నందు కానుకల వలన రూ- 1,57,257 /-రూపాయలు ఆదాయం . కార్యనిర్వాహణాధికారి.. డి రామకృష్ణంరాజు తెలిపారు. నేటి సాయంత్రం శ్రీ స్వామివారికి కనకాంబరం పూలతో చేసిన అలంకరణ దర్శించండి.
