సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాండస్ తుఫాన్ తీరం దాటిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతుండడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. చేపల, రొయ్యల చెరువుల లో కూడా విపరీతంగా నీరు చల్లబడటంతో ఆక్సిజన్ సమస్య తలెత్తుతుంది. భీమవరం గత రాత్రి నుండి తెల్లవారు జామువరకు వర్షం చెదురుమదురుగా పడుతూనే ఉంది. కొన్ని చోట్ల రాత్రి విద్యుత్తూ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డెల్టా ప్రాంతాలలో కొన్ని పొలాల్లో భరకాలు కప్పి భద్రపరిచిన ధాన్యం రాశుల్లోకి వర్షపునీరు వచ్చిందని సమాచారం. ఇంకా సుమారు 35 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. మరోపక్క ఇంకా మాసూళ్లు అవ్వాల్సిన సుమారు 70 వేలు ఎకరాల్లో పంట మాసూళ్లు చేసే వీలు లేక అలానే ఉండిపోయింది అని సమాచారం. నేడు, ఆదివారం ఎండవచ్చి కొంత పరిస్థితి మెరుగ్గా కనపడుతుంది. మధ్యాహనానికి ఎండ ఇలానే కాస్తే రైతులు కోలుకొంటారు. జిల్లాలో నేటి ఆదివారం ఉదయం 8 గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలు.. అత్యధికంగా పెనుమంట్ర లో 78.4, పోడూరు 70.4, అత్తిలిలో 67.4, ఆచంట 53.2 పెంటపాడులో 28.6 మిల్లీ మీటర్లు తాడేపల్లిగూడెం 20.8,పెంటపాడు 27.2. తణుకు 31.2, వీరవాసరంలో 8.2 , భీమవరంలో14.6, మొగల్తూరులో 34.2, నరసాపురంలో21.4, పాలకొల్లులో 28.2 మి.మీ నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 33.16 మి.మీగా నమోదైంది.
