సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో 20 రూపాయలకు దొరికే టమాటాలు సైతం 2కాయలు 20 రూపాయలు పలుకుతున్నాయి.మార్కెట్ లో టమాటా ధరలు కేజీ కి వచ్చి 120 నుండి 150 రేట్లు పలుకుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కు 5 టన్నుల టమాటా కేటయించగా వాటిని రైతు బజారులలో నేటి ఆదివారం నుంచి భీమవరం, నరసాపురం, పాలకొల్లు రైతు బజార్లలో కిలో రూ.50 చొప్పున రాయితీపై టమాటాల విక్రయాలుచెప్పట్టారు. రేపు సోమవారం మరికొన్ని పట్టణాలలోని రైతు బజారులలో టమాటాలు రాయితీ ఫై విక్రయిస్తారు. అయితే కొనుగోలు దారులు టమాటాల కోసం తమ ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
