సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని ప్రముఖ విద్య సంస్థ నారాయణ కళాశాలలో ఫీజులు కట్టలేదని విద్యార్థులను తరగతులకు పంపకుండా సెల్లార్లో కూర్చోబెట్టి విద్యార్థుల తల్లితండ్రులు వెంటనే పీజులు కట్టి తీరాలని డిమాండ్ చేసినట్లు తమ దృష్టికి రావడంతో పట్టణంలోని ఎబివిపి ఆధ్వరంలో గత మంగళవారం కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. ఫీజులు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల బయట కూర్చోబెట్టి నారాయణ యాజమాన్యం అవమానించడం దారుణమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) భీమవరం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కాయిత డిన్ను దండు మాట్లాడుతూ .. విద్యార్థుల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు గమనించకుండా వారిని తరగతులకు పంపకుండా మానసికంగా వేధించడం దారుణమన్నారు తదుపరి ఎబివిపి నేతల చొరవతో నారాయణ యాజమాన్యం విద్యార్థులకు పీజులకు మరికొంత గడువు ఇచ్చింది. . కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
