సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన , టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు ముఖ్య అతిధిగా మెంటే పార్ధ సారధి, పీతల సుజాత సమక్షంలో భీమవరం పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో నియోజకవర్గ టిడిపి కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం నేడు, శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ .. భీమవరం నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని పదవులు రానివారు నిరాశ చెందకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పార్టీ అధిష్టానం ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తుందన్నారు. కూటమి ప్రజా సంక్షేమ పధకాలను ప్రభుత్వ అభివృద్ధిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు.రాష్ట్ర పార్టీ ఆమోదించిన వీరవాసరం భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణ నాయకులు గ్రామ, వార్డు కమిటీల నాయకులు మరియు బూత్, యూనిట్, క్లస్టర్ కన్వీనర్లు, కో-కన్వీనర్లలచే ( సభలో గందరగోళం మధ్య స్వీకారోత్సరం హడావిడిగా జరిగింది)ప్రమాణ స్వీకారం చేయించారు. మూడు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ కొయ్యలగడ్డ గణపతి కోళ్ల సీతారాం మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ మరియు కార్యవర్గ సభ్యులు బూత్ కమిటీల సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు వెండ్ర శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్ అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్ కార్యనిర్వహక కార్యదర్శి మైలబత్తుల ఐజాక్ బాబు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట త్రిమూర్తులు వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య ఉప్పులూరి చంద్రశేఖర్ ఎండి షబీనా నాగిడి తాతాజీ క్లస్టర్ ఇన్చార్జిలు మెంటే గోపి యరకరాజు గోపాలకృష్ణరాజు అల్లూరి సుబ్రహ్మణ్యరాజు ఎద్దు ఏసుపాదం పాలా శ్రీరామదాసు ఎండి నౌషాద్,బర్రె నెహ్రూ కోళ్ల రామచంద్రరావు తదితర నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *