సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సరం లో (తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన) ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తే తగిన గుర్తింపు లేదని పార్టీలో కొందరు సీనియర్ నేతలలో అసంతృప్తి జ్వాలలు బహిర్గతం అయ్యాయి. సభ జరుగుతున్నప్పుడే మెంటే గోపి వేదికపై ఉన్న పెద్దలను సీనియర్ నేత మెంటే పార్ధ సారధి కి తగిన గౌరవం ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. కోళ్ల నాగేశ్వర రావు ప్రసంగిస్తున్నప్పుడు రాయలం లీడర్ కోళ్ల రామచంద్రరావు అభ్యన్తరం పెట్టడానికి ప్రయతించడం, సీనియర్ నేత పామర్తి వెంకటరామయ్య తీవ్ర స్వరంతో పార్టీ కష్టకాలం లో ఉన్నపుడు ఎవరు వచ్చారు? అని ప్రశ్నించడం సభలో 2 వర్గాలుగా వేదికపై చేరి వాదులాడుకోవడం దీనితో ‘వాదనకు ఇది సమయం కాదని’ మెంటే పార్ధసారధి వారించిన వారు వినకపోవడంతో సభ నుండి బయటకు వెళ్ళటానికి ప్రయత్నించడం, ఇదే సమయంలో హడావిడిగా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించి నేతలు ఊపిరి తీసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కావడంతో పదవులు 3 పార్టీల నేతలు పంచుకోవాలి. నిజానికి భీమవరం కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ని మాత్రమే నమ్ముకుని 40 ఏళ్ళు పైగా కష్టనష్టాల్లో పార్టీకి అండగా నిలచినవారికి, వారి మద్దతుదారులకు కాకుండా కొత్త నీరుకు అవకాశాలు రావడం.. వారు వేరే పార్టీలు మారి వస్తే వారికీ ఎందుకు అందలం? ఎక్కిస్తున్నారని టీడీపీ సీనియర్స్ లో అసంతృప్తి రగిలిపోతుంది. ఎంతకాదన్న స్థానిక ఎమ్మెల్యే, కానీ ఎంపీ, కానీ టీడీపీ పార్టీకి చెందినవారు లేకపోవడం ప్రధాన సమస్య..టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి మడమ త్రిప్పకుండా పనిచేసి రాజకీయా పార్టీలకు అతీతంగా అందరి గౌరవం పొందే నేత..కార్యకర్తలను కాచుకొన్న నేత.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్జక్షుడుగా 3 మారులు, భీమవరం మునిసిపల్ వైస్ చైర్మెన్ గా పనిచేసిన మెంటే పార్ధ సారధి లాంటి సీనియర్ అగ్ర నేత కనీసం ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కూడా కాలేదంటే అది ఎవరికీ గౌరవం ? నిజం నిష్ఠురమైన సరే.. పార్టీ కోసం సర్వము అర్పించి దూరంగా ఉంటున్న వారు ఎందరో..
