సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రంలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు ఫాల్గుణ మాసం మాస శివరాత్రి సందర్భముగా సంవత్సరము నకు ఒక్కసారే నిర్వహించు భస్మాభిషేకం(విభూది) వేదమంత్రాల అర్చనతో నిర్వహించటమైనది. ఆపై విబూది అలంకరణలో శ్రీ సోమేస్వరుని అలంకరణ ఫై చిత్రంలో చూడవచ్చు,, ఈ కార్యక్రమం నందు శ్రీమతి కోడే విజయలక్ష్మి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు ధర్మకర్తలు కోయతాతాజీ, నల్లం రఘుబాబు,చెల్లబోయిన సూర్యప్రకాష్ , సోమాదూల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ , భక్తులు పాల్గొనగా ఆలయ అర్చకులచే ఈ కార్యక్రమం నిర్వహించటమైనది. కార్యనిర్వహణాధికారి, ఎం అరుణ్ కుమార్ పర్యవేక్షించడం జరిగింది.
