సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములకు భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు. రేపటి శనివారం నుండి వరుసగా 3 రోజులు భక్తులు రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది. నేటి శుక్రవారం సాయంత్రం శ్రీ స్వామి వారి అలంకరణ ను ఫై చిత్రంలో చూడవచ్చు. నేడు 4 రోజు సర్వ దర్శనంతో పాటు టికెట్స్ ద్వారా భక్తులుప్రత్యేక దర్శనముల ద్వారా రూ.9,200/లు, పూజా రుసుముల ద్వారా రూ.6,930/లు, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.2,880/లు విరాళముల ద్వారా రూ.2,000/ మెత్తం రూ.21,010/లు ఆధాయం ( హుండీ కానుకలు కాదు)వచ్చింది. నేడు, దేవస్థానం నందు ధర్మకర్తలు వి.వెంకటేశ్వర రావు తనిఖీదారు దేవదాయ శాఖ వారి సమక్షములో భక్తులచే సమర్పించబడిన ఛీరలు పంచెలు విక్రయించగా రూ.30,565/_లు ఆధాయం వచ్చిందని .కార్యనిర్వహణాధికారి, డి రామకృష్ణ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *