సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పంచారామా క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వారి దేవస్థానం నందు కార్తీకమాసం ఆఖరి 4వ ఆదివారం సందర్బముగా నేడు, వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకొన్నారు. నేటి సాయంత్రం 5గంటల వరకు అందిన సమాచారం ప్రకారం లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.26,250/-లు దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,58,610/-లు మొత్తం రూ.2,84,860/-లు ఆదాయం వచ్చియున్నది. ( హుండీ కాకుండా) ఆలయ ఆవరణలో మహా అన్నసమారాధన లో వెలది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తగు ఏర్పాట్లను ధర్మకర్తల మండలి అధ్యక్షలు శ్రీమతి కోడే విజయ లక్షీ , ధర్మకర్తలు మరియు కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు, నిన్నశనివారం రాత్రి 10 గంటలు సమీపిస్తున్న భక్తులు శ్రీ సోమేశ్వర దర్శనానికి తరలి రావడం విశేషం. ( ఫై చిత్రంలో నేటి మద్యాహ్నం స్వామివారికి దేవేరులతో ఏర్పాటు చేసిన సుందర అలంకారామ్ చూడవచ్చు..)
