సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ ; జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా ముగిసాయి. వార్షికోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ ఆదేశాల మేరకు భీమవరం పీపీ రోడ్డులోని పోలీస్ బొమ్మ సెంటర్లో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, టూ టౌన్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ట్రాఫిక్ సిఐ దాస్ , అధికారులు సిబ్బంది తో కల్సి, రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిషన్ ఎస్పీ సుబ్బరాజు మాట్లాడుతూ.. గత నెల అక్టోబర్ 21 నుండి 31వ తారీకు తో వారోత్సవాలు అందరి సహకారంతో ఘనంగా ముగిసినవని ఈ వారోత్సవాల్లో అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించామని ప్రజా సేవలో అమరులయిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *