సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ముందుగా 36వ వార్డు ఎమ్మార్ నగరం నందు 16 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు.అనంతరం 37వ వార్డు యాదవుల వారి వీధిలో 40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి, 34 వ వార్డులో పళ్ళ వారి వీధిలో 22 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగాచేసుకుని తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత నాలుగున్నరేళ్ళూ గా నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని .. జిల్లా కేంద్రం అయ్యాక ప్రత్యేకంగా భీమవరం పట్టణంలో నూతన సిసి రోడ్డులు, డ్రైన్ ల నిర్మాణాలకు రూ 90 కోట్ల వ్యయం చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులోను అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు.
