సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానానికి ఎట్టకేలకు సుమారు 36 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.1987లో మొదటి మాస్టర్ ప్లాన్ తయారుచేయగా ఇప్పటివరకూ అదే కొనసాగుతుంది. గత 2023 ఫిబ్రవరి నెల లో ఏలూరు అర్బన్ డెవలమెంట్ అథారిటీ (ఇడా) నూతన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్టును భీమవరం మున్సిపాలిటీలోప్రదర్శనకు ఉంచారు. ఇందులో విలీన గ్రామాలైన రాయలం , చినఅమిరం , తాడేరు, కొవ్వాడ, నరసింహపురం కలుపుతూ ప్లాన్ సిద్ధం చేశారు. డ్రాప్టుపై గతంలో వచ్చిన అభ్యంతరాలు, కమిటీల సూచనలు, సలహాలు మొత్తంగా 111 అంశాలను పరిశీలించి మార్పులు చేర్పులతో తుది మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసి ఈ మేరకు ఈనెల 17న జీఓ విడుదల చేశారు. నూతన మాస్టర్ ప్లాన్ భీమవరం మున్సి పాలిటీలో విలీన గ్రామాలైన తాడేరు, కొవ్వా డ, రాయలం , చిన అమిరం , నరసింహపురం తోపాటు విస్సా కోడేరు, కుముదవల్లి,కొవ్వాడ అన్నవరం మొత్తం 8 గ్రామాలకు సంబంధించినదిగా ఉంది. ఈ సందర్భముగా ప్రభుత్వ విప్ , స్థానిక ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్ సహకారంతో .. భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు అయ్యాక భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభా, విద్య , వైద్య , పారి శ్రామికం గా రంగాల్లో అభివృ ద్ధికి నూతన మాస్టర్ ప్లాన్ దోహదపడుతుందని మాస్టర్ ప్లాన్ అమలు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం శుభపరిణామం అన్నారు.
