సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ ఎన్నికలకు ఈనెల 26న పోలింగ్ కు అధికారులు సర్వము సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే పోటీ చేస్తున్న చైర్ పర్సన్, కౌన్సిల్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తీ కావడంతో వారు ఆయా గుర్తులతో ఇంటింటా ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. 8 ఏళ్ళ తరువాత వార్డులలో అభ్యర్థుల ప్రచార సందడి మైక్ ల ప్రచారం లో .. సంబంధిత అభ్యర్థికే మీ ఓటు.. గుర్తు కే మీ ఓటు అంటూ వాయిస్ లు వినబడుతూ మంచి సందడిగా ఉంది. ఇక భీమవరం మునిసిపాలిటీ నుండి నేడు, ఆదివారం కీలకమైన అప్ డేట్ వచ్చింది. 52 వార్డుల లలో సుమారు ఓకటిన్నర లక్షల పైగా పట్టణ ఓటర్లు ఓటు వెయ్యడానికి వార్డు కు వచ్చి 2 నుండి 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వాటి అడ్రస్సులు విడుదల చేసారు. మొత్తం పట్టణంలో 157 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
