సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం పట్టణం నూతన మున్సిపల్ కమిషనర్ గా ఎం శ్యామల పదవి బాధ్యతలు స్వీకరించిన స్థానిక మునిసిపల్ కార్యాలయంలో భీమవరం పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది మరియు వార్డు సచివాలయ శానిటేషన్ సెక్రటరీలందరితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టణంలోని ప్రారిశుధ్య మెరుగుదలకై పలు సూచనలు చేసారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి 100% వేరుచేసిన వ్యర్ధాలను సేకరించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు, వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలో లోతట్టు ప్రాంతాలలో రానున్న వారం రోజుల్లో పారిశుధ్య మెరుగుదల కొరకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అలాగే ప్రజల వద్ద నుండి వసూలు చేస్తున్న క్లాప్ యూజర్ చార్జీల వసూలు యందు పురోగతి కనబరిచి క్లాప్ వెహికల్ సామర్థ్యాన్ని 100% ఉపయోగించుకోవాలన్నారు, అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ నమోదు అందు అన్ని వాటిలో సచివాలయ సిబ్బంది విధిగా పాల్గొని పట్టణ ర్యాంకింగ్ మెరుగుదలపై సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు, .. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ PV రంగారావు , సానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు వార్డ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
