సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో అన్ని శివాలయాలలో కార్తీక శోభ ప్రారంభమయింది. స్కంద పురాణంలో పేర్కొన్న పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలోనేడు, బుధవారం కార్తీక మాస శోభలు శివోహం అంటూ ప్రారంభమయ్యాయి. నేటి తెల్లవారు జాము 3 గంట నుండే వేలాదిగా భక్తులు తరలి రావడం శ్రీస్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను ఆలయ ప్రధానార్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ గారు నేతృత్వంలో జరిగింది. దేవాలయ ఆవరణలో కార్తీక దీపాల వెలుగులతో కార్తీక శోభ ప్రారంభమయింది. 28 రోజులు పాటు జరిగే ఈ కార్తీక మాసము లో లక్షలాదిగా భక్తులు శ్రీ సోమేశ్వరుని దర్శించుకోనున్నారు. వారి దర్శనం వేగంగా జరగడానికి కోసం అన్ని ఏర్పాట్లు ‘ధర్మకర్తల మండలి సౌజన్యం’ తో దాతల సహకారంతో నిర్వహించనున్నారు. ప్రతి రోజు దేవాలయ ఆవరణలో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల భోజన వసతి ఏర్పాట్లు చేసారు. ప్రతి ఏడాదిలానే మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబం భక్తుల అన్న సమారాధనకు కావలసిన బియ్యం భూరి విరాళంగా అందజేశారు. భక్తులు కూడా ప్రతి రోజు అన్న సమారాధన చెయ్యడానికి విరాళం ఇవ్వడానికి దేవాలయం వెనుక ఉన్న ఆలయ ఇఓ రామకృష్ణంరాజు గారి కార్యాలయం ను సంప్రదించాలి. నేడు, శ్రీ స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు దర్శించుకొని, చైర్మెన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తలతో కల్సి భక్తులకు అన్న సమారాధన ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *