సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం వ్యవసాయం మార్కెటింగ్ కమిటీ (AMC ) లో నేడు, బుధవారం పవిత్ర కార్తీక మాసం భోజనాలు వన సమారాధన పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నఅందరు ఏఎంసీ చైర్మన్ ల ఆత్మీయ సమావేశం భీమవరం ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రజు వారి ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా amc ప్రాంగణంలో మొక్కలు నాటి సమావేశాన్ని మొదలుపెట్టారు ఈ సమావేశంలో రైతుల కష్టనష్టాల గురించి మరియు పుంత రోడ్ల సమస్యల గురించి ఏఎంసీ కి రావలసిన నిధుల గురించి చర్చించారు కొంతసేపు ఆత్మీయ పలకరింపులు ఈ సమావేశం జరిగింది. అనంతరం త్రీ సభ్య కమిటీ కింద ఏర్పాటు చేసుకొని అధ్యక్షులుగా భీమవరం ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్ర రాజు సభ్యులుగా పాలకొల్లు విఎంసి చైర్మన్ కోడె విజయభాస్కర్, చాపల మంగ బాయ్ రమేష్ లను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో, ఉండి ఏం సి చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, ఆకివీడు ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, పాలకొల్లు ఏఎంసీ చైర్మన్ కోడె విజయభాస్కర్, నరసాపురం ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, తణుకు ఏఎంసీ చైర్మన్, కొండేటి శివ, తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్, చేపల మంగ బాయ్ రమేష్, అత్తిలి ఏఎంసీ చైర్మన్, దాసం ప్రసాద్, మరియు భీమవరం ఏఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్, మరియు కమిటీ సభ్యులు, పాల్గొన్నారు
