సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నేడు, శుక్రవారం ఉదయం నుండి స్థానిక ప్రజల వద్ద నుండి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పలు ఫిర్యాదులు అర్జీలు దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ .. వీరవాసరం భీమవరం మండలాలు మరియు భీమవరం పట్టణంలోని ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో పరిష్కరించడానికి ప్రతి శుక్రవారం ప్రజావేదిక నిర్వహిస్తున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వైద్య చికిత్సలు చేయించుకున్న వారు మరియు వైద్య చికిత్స చేయించుకునే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. అనంతరం వీరవాసరం గ్రామానికి చెంది చెందిన కట్ట స్వాతి క్యాన్సర్ వ్యాధి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల 30 వేల రూపాయల ఎల్.ఓ.సి అందజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మద్దుల రాము,కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, వీరవల్లి శ్రీనివాస్, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్ పామర్తి వెంకటరామయ్య, ఎండి నౌషాద్, ఎండి షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, కోళ్ల నాగబాబు ,మాదాసు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు
