సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మన భారత మాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం ‘వందేమాతరా’నికి 150 ఏళ్లు పూర్తి సందర్భంగా నేడు శుక్రవారం భీమవరం లో మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ముక్త కంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వారు మాట్లాడుతూ వందేమాతర గేయాన్ని 1875 నవంబరు 7న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ కూర్చారన్నారు. వందేమాతరం అంటే నేను తల్లిని ప్రార్థిస్తాను అని అర్థమని, వందేమాతరం దేశ జాతీయ గేయమన్నారు. 150 సంవత్సరాల వందేమాతరం పాట కాదని, అది దేశభక్తి జ్వాల అని, కొన్ని పాటలు వినిపించటమే మాత్రమే కాదని, మన హృదయాల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కారుమూరి సత్యనారాయణ,కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్, కంచర్ల భాస్కరరావు , బొండాడ సుబ్బారావు, కురిశెట్టి సతీష్, కనగర్ల రామకృష్ణ, తదితరులు అన్నారు.
