సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని 3 టౌన్ హొసింగ్ బోర్డు కాలనీ లో డిసియంయస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి నివాసంలో నిర్వహించిన భీమవరం నియోజకవర్గ బీసీ నేతల ఆత్మీయ సమావేశానికి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు కవురు శ్రీనివాస్ , ZPTCనరసింహారావు, ఎంపీటీసీలు పలువురు బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గోన్నారు. వక్తలు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ చేస్తున్నసామజిక నాయ్యం లో భాగంగా సాహసోపేతంగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తొలిసారిగా వైసిపి అభ్యర్థిగా బిసి మహిళా గూడూరి ఉమాబాలకు కేటాయించడం శుభపరిణామం అని దీనికి ఓసి కులాల మిత్రులు, ఎస్సీ, ఎస్టీ మిత్రులు కూడా స్వాగతిస్తున్నారని, కాబ్బటి తొలిసారి వచ్చిన ఈ అవకాశాన్ని సదివినియోగం చేసుకొని ఎట్టి పరిస్థితులలో సమైక్యంగా గూడూరి ఉమాబాల గారిని గెలిపించుకొనే బాధ్యత మనమీద ఉందని, భీమవరంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మరోమారు గెలిపించుకోవాలని పిలుపు నిచ్చారు.
