సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం విష్ణుపూర్ లోని బి. వి. రాజు డిగ్రీ కళాశాల లో నేడు, గురువారం ప్రపంచ AIDS డే సెలెబ్రేషన్స్ ను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. మన దేశంలో ఎయిడ్స్ కేసులు నిరోధించడానికి ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే సమర్ధవంతమైన యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ ప్రజలకు మరింత అవగాహనా అలాగే వారి ఆరోగ్యం పట్ల, జీవన శైలి పట్ల మరియు మెరుగైన జీవితం అందించడానికి కృషి జరగాలని అప్పుడు ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమివెయ్యవచ్చునని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఐ ఆర్ కె రాజు వాలంటీర్స్ తో ఉన్నత ఆరోగ్యం, నడవడిక గూర్చి ప్రతిజ్ఞ చేయించారు.తరువాత వాలంటీర్స్ ఆశ చిహ్నం ను దరించి ఆశ చిహ్నం రూపాన్ని రూపొందించారు. ఫై చిత్రంలో చూడవచ్చు..
