సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా గత బుధవారం రాత్రి భీమవరం మార్కెట్ యార్డులోభారీ స్టేజ్ ఫై ప్రభాస్ ఫ్లెక్సీలు ఉంచి సినీనటులు యాంకర్స్ తో సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే గత సాయంత్రం స్థానిక ప్రభాస్ అభిమానులకు బయట ప్రాంతం నుండి వచ్చిన నిర్వాహకులకు మధ్య కాస్త త్రోపులాట జరిగినప్పటికీ విశేషంగా హాజరు అయిన రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధుల సమక్షంలో రాత్రి కార్యక్రమం సజావుగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ ప్రభాస్ పుట్టినరోజు తో దీపావళి పండుగ ముందుగానే వచ్చినట్లు కనిపిస్తుందని, అందరూ అదరించే అభిమానించే నటులు ప్రభాస్ అని అన్నారు. అనంతరం యాంకర్ రవి, లహరి,జబర్దస్త్ రాకేష్, డి షో డ్యాన్సర్ లతో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అడ్జక్షుడు, ఎపిసీసీఐ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు, , ఎమ్మెల్సీ చిరంజీవి రావు, పలువురు ప్రభాస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
