సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, మంచి టాలెంట్ ఉన్న యువ హీరో శ్రీ విష్ణు హీరోగా అపట్లో ఒకడుండేవాడు.. సినిమా దశాబ్దం క్రింద సంచలన హిట్ తరువాత ఆ స్థాయి సూపర్ హిట్ మరేదీ పడకపోవడం తో కాస్త వెనుకబడి నప్పటికీ ఇటీవల ‘సామజవరగమన‘ తో మంచి కామిడీ సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా సూపర్ డూపర్ హిట్ కొట్టేసాడు. రామ్ అబ్బ రాజు దర్శకత్వంలో, సీనియర్ హీరో నరేష్ కీలక పాత్రలో రూపొందిన ‘సామజవరగమన’ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఈ సినిమా థియేటర్స్ రైట్స్ కేవలం 3 కోట్లకు అమ్మితే 30 కోట్ల కలెక్షన్స్ ఒక్క వారం లో వచ్చిందంటే ఏ రేంజ్ హిట్.. ? కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మొదటి వారం లో ప్రపంచవ్యా ప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
