సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ పదవి బాధ్యతలు చేపట్టారు. నేడు, బుధవారం ఉదయం భీమవరం ఏఎంసీ కార్యాలయంలో కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు, తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి , ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు జిల్లా బిజెపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి మరియు కూటమి నాయకుల సమక్షంలో ఏఎంసి నూతన చైర్ పర్సన్ కలిదిండి సుజాత వైస్ చైర్మన్ బండి రమేష్ మరియు డైరెక్టర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. భారతదేశానికి రైతులు వెన్నుముకని పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయం అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిందని ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన నూతన కమిటీ రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నేతలు కోళ్ల నాగేశ్వరరావు వెండ్రా శ్రీనివాస్ జనసేన నేత చెనమల్ల చంద్రశేఖర్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *