సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల విడుదల చేసిన భీమవరం మాస్టర్ ప్లాన్ పై మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ ను కలసి పలు అభ్యంతరాలు తెలియజేసారు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం భీమవరం పట్టణానికి హుటా హుటీనా మాస్టర్ ప్లాన్ రెడీ చేసి డ్రాఫ్టింగ్ చేయడం జరిగింది అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సిన స్థలములు,ఇల్లులు ప్రభుత్వ అధికారులను ఇబ్బంది పెట్టి కమర్షియల్ & రెసిడెన్షియల్ ఏరియా లోకి పెట్టుకుని వాళ్ళకి నచ్చని వాళ్ళవి పబ్లిక్ ,సెమి పబ్లిక్ లో పెట్టడం జరిగింది.ఎక్కడో మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న స్థలాలు కూడా సెమి పబ్లిక్ లో పెట్టడం దారుణమని తెలియజేసారు . ఇలా ఇన్ని తప్పులు చేసి మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం చాల హాస్య స్వదంగా ఉందని ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న లోపాలను మున్సిపల్ కమీషనర్ గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ మాస్టర్ ప్లాను పై కలెక్టర్ గారికి మరియు DTCP వారికి కూడా పిర్యాదు చేస్తామని తెలియజేసారు . ఈ కార్యక్రమాలో జనసేన పట్టణ ప్రెసిడెంట్ చెన్నమల్ల చంద్రశేఖర్ , మాజీ కౌన్సిలర్ వానపల్లి సూరిబాబు ,కాళీ శేఖర్ పాల్గొన్నారు.
