సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఈసారి అత్యధిక సంఖ్యలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి శబరిమలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో .శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం డిసెంబర్, జనవరినెలల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు డివిజన్ల మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే రైళ్ల వివరాలు చుస్తే.. భీమవరం మీదుగా నర్సాపూర్–కొట్టాయం (07119) డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతారు. మరల తిరుగు ప్రయాణాలకు, కొట్టాయం –నర్సాపూర్ (07120) డిసెంబర్ 3, 10, 17, 31, జనవరి 7, 14 తేదీల్లో నడుస్తాయని వివరించారు. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యే క రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు
