సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ ఎన్ని హాచ్చరికలు చేసిన ఇటీవల కాలంలో భీమవరం ప్రధాన రోడ్లపై సంచరిస్తూ సేదతీరుతున్న ఆవుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనిపై భీమవరంలో గాయపడిన పశువుల సంరక్షకుడు ఆపద్భాంధవుడు గా పేరుగాంచిన ‘సుంకర దాస్’ మన సిగ్మా న్యూస్ తో తన ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల కాలంలో రోడ్లపై గాయపడుతున్న ఆవులు ఇతర పశువుల సంఖ్యా బాగా పెరిగిపోయిందని తన దృష్టికి వచ్చిన మేర ఇతర స్వచ్చంద సేవలకుల సాయంతో సేవలు అందిస్తున్నప్పటికీ తరచూ వాహనాల వేగానికి అవి గాయాల పాలవుతున్నాయని వారానికి కనీసం పది పదిహేను ఆవులు చొప్పున చనిపోతున్నాయని ఆవేదన చెందారు అలాగే ఈ ఆవును( పైచిత్రం లో ) ఎవరో గుద్ధి వెళ్లిపోతే కాలుకు ఉన్నడక్క ఓడిపోయి నరకం చూస్తుందని వైద్యులతో వైద్యం అందించమని తెలియజేశారు. ఆవుల యజమానులు కూడాదయచేసి రోడ్లమీదకు ఇవి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుంకరదాసు కోరారు
