సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో తుపాను ప్రభావంతో నేడు, సోమవారం ఏకబిగిగా భారీ వర్షంతో పాటు పూర్తిగా చలిగాలుల తీవ్రత తో మబ్బులతో గాఢాంధకారం అలముకొంది. రోజంతా చీకటి లో ప్రజలు ఇంట్లో విద్యుత్తూ దీపాల వెలుగులో గడపవలసి వచ్చింది. వ్యాపారస్తులు దిగాలు పడ్డారు..పట్టణంలో పలు ప్రాంతాలు జలమయ్యాం అయ్యాయి. ఈ నేపథ్యంలో భీమవరం పురపాలక సంఘ పరిధిలోగల లోతట్టు ప్రాంతాలను కమిషన్ శ్యామల పరిశీలించారు, దుర్గాపురం లంకపేట మెంటేవారితోట కు సంబంధించి వార్డు సచివాలయ సిబ్బంది తో కలిసి రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ప్రజల మంచినీటి అవసరాలను తీర్చే ఏర్పాట్లను, మురుగు నిల్వ ఉండే ఏరియాస్ అలాగే శానిటేషన్ కు సంబంధించి తక్షణమే క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఇది ఇలా ఉండగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి నేడు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లే … రేపు, మంగళవారం కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు.
