సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, భీమవరం వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు సివిల్ ఇంజనీరింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ సంయుక్తంగా నిర్వహించిన వన్ వీక్ ATAL ఎఫ్ డి పి కార్యక్రమం నేడు, శనివారంతో ముగిసిందని డైరెక్టర్ & ప్రిన్సిపాల్ డాక్టర్ దశిక సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆధునిక నిర్మాణ రంగంలో సాంప్రదాయ విధానం ద్వారా నమూనాను రూపొందించే స్థానంలో సాంకేతికత 3D ప్రింటింగ్ ద్వారా సంక్లిష్టమైన నమూనాలను కూడా వేగవంతంగా రూపొందించవచ్చని ఈ అంశం పైన ఎఫ్ డి పి ద్వారా ఉపాధ్యాయులు శిక్షణ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఓ డి, శర్మ మాట్లాడుతూ.. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బిమ్) అనేది ప్రాజెక్ట్ నిర్వహణను సులభతరం చేసే సాఫ్ట్వేర్ అని దాని వినియోగం ద్వారా ప్లానింగ్, డిజైన్,నిర్మాణ ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లు తో పాటు ఈ ఎఫ్ డి పి లో వివిధ రాష్ట్రాల నందిలి ఇంజనీరింగ్ కాలేజీలకీ చెందిన 48 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని చెప్పారు.
