సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని డాక్టర్ బి.వి.రాజు ఫౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు 7 రోజులు నిర్వహించిన ఇండస్ట్రీ అకాడెమియా ప్రాక్టీసెస్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అను వర్క్షాప్ 14 డిసెంబర్ తో ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ డా.మంగం వేణు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.యం వేణు మరియు వైస్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మిలు మాట్లాడుతూ,..“ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు పరిశ్రమల అవసరాలను అర్థం చేసుకోవడానికి , విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి దోహదపడుతుందని, పరిశ్రమలో అనుభవజ్ఞుల నుంచి విద్యార్థులు పొందిన అవగాహన వారి కెరీర్ అభివృద్ధికి మార్గదర్శకంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.జిందాల్ పంతర్ సంస్థ స్టీల్ ఉత్పత్తి, దాని నాణ్యత నియంత్రణ, మరియు నిర్మాణాల్లో స్టీల్ వినియోగం ఎలా ఉండాలో విద్యార్థులకు వివరించింది. ఈ కార్యక్రమంలో అంజని టెక్, సాగర్ సిమెంట్స్, వీరా కాంక్రీట్, అల్ట్రాటెక్, యూకాన్, పాసిబిల్ట్, జిందాల్ పంతర్, పద్మప్రియ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గాయత్రి అసోసియేట్స్, మరియు స్ట్రెజ్సా వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
