సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం స్థానిక సుమారు 1150 ఏళ్ళ క్రితం చాణుక్య బీముడు నిర్మించిన అతి పురాతన శ్రీ భీమేశ్వర ఆలయం. మరి ఈఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం సీజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) రూ1 కోటి నిధులు మంజూరు చేసిందని దేవస్థాన ఈవో తోట శ్రీనివాస్, చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ లు ప్రకటించారు. ఈనేపథ్యంలో నేడు బుధవారం ఎమ్మెల్యే అంజిబాబుకు ఆయన కార్యాలయంలో కృతజ్ఞలు తెలిపారు.అంజిబాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో దేవాలయాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈవో, చైర్మన్ . ఆలయ ధర్మ కర్తల మండలి సభ్యులు మాట్లాడుతూ.. ఈ కోటి రూపాయల నిధులతో ఆలయంలో కళ్యాణ మండపం, ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *