సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయంలో నేడు, గురువారం శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో విశేషంగా భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించారు. పలువురు భక్తులు శ్రీ అమ్మవారికి కానుకలు అందజేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి కి చెందిన మంగిన గోపాలకృష్ణ దంపతులు శ్రీ అమ్మవారిని దర్శించుకొని 8 గ్రాముల బంగారం కానుకగా దేవాలయ సిబ్బందికి అందజేశారు. తదుపరి కోపల్లె గ్రామానికి కి చెందిన బి వరలక్ష్మి 4 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆలయ సహాయ కమిసనర్ మరియు కార్యనిర్వహణఅధికారి యర్రంశెట్టి భద్రాజీ మరియు ఆలయ ధర్మకర్త తాళ్లపూడి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు
