సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, మంగళవారం (తేదీ నవంబర్ 28)భక్తులు హుండీలో ఇటీవల కాలంలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా మొత్తం 50లక్షల 74 వేల 461 రూపాయలు లభించింది. ఇక బంగారు కానుకలు 132 గ్రాముల 500 మిల్లి గ్రాములు లభించగా,వెండి 539 గ్రాముల 200 మిల్లి గ్రాములు లభించాయని, ఈ కానుకలు లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఇఓ, మరియు సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు.
