సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుండి 16, 2023 వరకు 7రోజుల పాటు“కరెంట్ ట్రెండ్స్ అండ్ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్” అనే అంశంపై (AICTE) వారి సహకారంతో నిర్వహించబడనున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నేడు సోమవారం ప్రారంభమయ్యింది అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస రావు గారు మరియు వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ పి. శ్రీనివాస రాజు తెలియజేసారు.ఈ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి NIT-AP తాడేపల్లిగూడెంలోని EEE విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ V. సందీప్ రిసోర్స్ పర్సన్‌గా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ పాత్ర గురించి కీలక అంశాలు అందించారు. మరో విశేషం ఏమిటంటే... మలేషియా దేశ రాజధాని అయినటువంటి జొహర్ బాహరు నగరంలో నేడు,సోమవారం ప్రారంభమైన ‘ఏషియా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2023’ అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 84 కేజీల సబ్-జూనియర్ విభాగంలో శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజీ ఫర్ విమెన్ లో కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో ప్రధమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి పిల్లి వందన మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ 3వ స్థానంతో పాటు ఓవర్ ఆల్ చాంపియన్షిప్ లో మొత్తం 4 మెడల్స్ ను సాధించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *